నా సుఖవంతమైన నిద్రకు ఆమె కారణం: అర్జున్ కపూర్

by Prasanna |   ( Updated:2023-01-17 10:20:54.0  )
నా సుఖవంతమైన నిద్రకు ఆమె కారణం: అర్జున్ కపూర్
X

దిశ, సినిమా : మలైకా అరోరాతో తనకున్న అద్వితీయ సంబంధం గురించి అర్జున్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'కుత్తే' జనవరి 13న విడుదలవగా ప్రమోషన్‌లో బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ సమావేశంలో మలైకాతో తన ప్రేమ జీవితంపై పలు విషయాలు ప్రస్తావించాడు. 'మేమిద్దరం సురక్షితమైన భాగస్వామ్యాన్ని కలిగివున్నాం. రోజువారీ కార్యకలాపాలు, ఆలోచనలన్నింటినీ షేర్ చేసుకుంటాం. ఒకరికొకరం ఎల్లప్పుడూ మద్ధతుగా నిలుస్తూ మా రిలేషన్‌ను మరింత బలపరుచుకుంటున్నాం. మేమిద్దరం ఒకరికొకరం బాగా సరిపోయామనే భావిస్తాం. నేను సంతోషంగా పడుకోవడం, అంతే హ్యాపీగా నిద్ర లేవడానికి కారణం ఆమెనే' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్న కామెంట్లతో స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : సెకండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన స్టార్ నటి.. బేబీ బంప్ ఫొటో వైరల్

Advertisement

Next Story