Arjun Kapoor: సోదరి మాతృత్వంపై హీరో ఎమోషనల్ నోట్.. నమ్మలేకపోతున్నానంటూ

by Hamsa |   ( Updated:2022-09-04 11:10:19.0  )
Arjun Kapoor: సోదరి మాతృత్వంపై హీరో ఎమోషనల్ నోట్.. నమ్మలేకపోతున్నానంటూ
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్.. తన సోదరి సోనమ్ కపూర్‌ మాతృత్వాన్ని ఉద్ధేశిస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన సోనమ్.. అంతకుముందు అర్జున్‌తో కలిసి 'కాఫీ విత్ కరణ్ 7' షోకు హాజరైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తమ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుని ప్రేక్షకులను అలరించారు. ఇదిలా ఉంటే, గర్భవతిగా ఉన్న సోనమ్.. కరణ్ టాక్ షోలో తనతో సంభాషిస్తున్న ఫొటోను తాజాగా నెట్టింట షేర్ చేసిన అర్జున్.. 'ఓ మైగాడ్ ఇది నువ్వేనా? ఎవరు పెరిగి పెద్దవారయ్యారో చూడండి.

ఆమె ఇప్పుడు తల్లిగా మారిపోయింది' అంటూ ఎమోషనల్‌గా క్యాప్షన్ ఇచ్చాడు. అదే పోస్ట్‌కు హార్ట్ ఎమోజీ కూడా జోడించగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఆగస్టు 20న మగ బిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా దంపతులకు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.

Also Read : బాలకృష్ణ చిన్న కూతురితో నాగచైతన్య పెళ్లి.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?

Advertisement

Next Story