'RRR' టీమ్‌కు అభినందనలు తెలిపిన A.R.Rahman

by Prasanna |   ( Updated:2023-01-21 14:09:25.0  )
RRR టీమ్‌కు అభినందనలు తెలిపిన A.R.Rahman
X

దిశ, సినిమా: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్‌ గోల్డ్‌ అవార్డును " ఆర్‌‌ఆర్‌‌ఆర్ " మూవీ సొంతం చేసుకుంది. ఇది నిజంగా భారత దేశం గర్వించదగిన విషయమనే చెప్పాలి. ఇక ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో " ఆర్‌ఆర్‌ఆర్‌ " నుంచి 'నాటు నాటు' పాట గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే స్వర మాంత్రికుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ స్పందిస్తూ.. కీరవాణి, రాజమౌళితో పాటు చిత్రయూనిట్‌ మొత్తానికి భారతీయులందరి తరుపున శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి : వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Advertisement

Next Story