‘మా’ అధ్యక్షుడిగా మళ్లీ మంచు విష్ణు.. చరిత్రలో ఇదే మొదటిసారి

by GSrikanth |
‘మా’ అధ్యక్షుడిగా మళ్లీ మంచు విష్ణు.. చరిత్రలో ఇదే మొదటిసారి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు రెండోసారి నియామకం అయ్యారు. ఆదివారం కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆయన్ను ఎన్నుకున్నారు. ‘మా’ అసోసియేషన్‌కు నూతన భవనం నిర్మించేంత వరకు అధ్యక్షుడిగా మంచు విష్ణునే కొనసాగిస్తున్నట్లు 26 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింగ్ సెక్రటరీగా కరాటే కళ్యాణి, ట్రెజరర్‌గా శివబాలాజీలను ఎంపిక చేశారు. ఈసీ సభ్యులుగా మధుమిత, శైలజ, జైవాణిలను ఎన్నుకున్నారు. అయితే.. ఐదేళ్ల వరకు ఒక్కరే అధ్యక్షుడిగా కొనసాగడం చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో సినీ ప్రముఖులంతా ఈ సందర్భంగా విష్ణుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story