సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్.. సంచలన విషయాన్ని బయటపెట్టడంతో షాక్‌లో నెటిజన్లు!

by Hamsa |
సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్.. సంచలన విషయాన్ని బయటపెట్టడంతో షాక్‌లో నెటిజన్లు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా హెల్త్ ప్యాడ్ కాస్ట్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెబుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నెబ్యులైజర్ పెట్టుకుని హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను తీసుకోవాలని చెప్పింది. దీంతో సమంతపై డాక్టర్ లివర్ డాక్ ఫైర్ అయ్యాడు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆమెను జైల్లో పెట్టాలంటూ పలు పోస్టులు పెట్టాడు. గత రెండు రోజుల నుంచి సమంత, లివర్ డాక్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్దం జరిగింది. దీనిపై స్పందించిన సమంత తాను డాక్టర్లు సూచనలే ఫ్యాన్స్‌తో చెప్తానని గట్టిగా కౌంటరిస్తూ నోట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో.. తాజాగా, దిగొచ్చిన డాక్టర్ సమంతకు క్షమాపణలు చెప్పాడు. కానీ పలు సంచలన విషయాలు బయట పెడుతూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ కూడాషేర్ చేశాడు. ‘‘శ్వాసకోశ వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని నెబ్యులైజేషన్ చేయడంపై పబ్లిక్‌గా ప్రమాదకరమైన తప్పుడు సమాచారం ఇచ్చిందని నేను సమంతను విమర్శించాను. ఆ తర్వాత చాలా మంది ఆమె గురించి నేరుగా నాకు మేసేజ్‌లు పంపి తన అనారోగ్యం విషయం చెప్పారు. ఆమె పరిస్థితి నాకు అర్థం అయింది. సమంత తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

ఈ విషయాన్ని నేను ఖండించిన తీరుపై ఆమె బాధపడ్డారని తెలిసింది. ఇందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను అది అనుకోకుండా జరిగింది. ఆమెను విమర్శించడం నా ఉద్దేశం కాదు కానీ అలా జరిగిపోయింది. కానీ ఆమె చెప్పిన హెల్త్ టిప్ సరైనది కాదు. తప్పు సమంతది కాదు ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌ది. అలాంటి వారి గురించి నేను చర్చించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. కానీ అతని నిజస్వరూపం బయటపెట్టాల్సిన అవసరం ఉంది. చికిత్స ఇస్తున్న వ్యక్తి దగ్గర సర్టిఫికేట్ కలిగి ఉండవచ్చు కానీ అసలు అతను డాక్టరే కాదు ప్రకృతి వైద్యుడు ఎప్పుడూ తప్పుడు సలహాలు ఇస్తుంటారు. అయితే అతడిని చాలాసార్లు హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదు. ఆ డాక్టర్ మోసగాడు నమ్మకండి’’ అని ఓ నోట్ షేర్ చేశాడు. ఇక సమంతను ట్రీట్ చేస్తున్నది డాక్టర్ కాదని తెలియడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అలాంటి వ్యక్తిని సామ్ ఎలా నమ్మిందని నెట్టింట చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed