దర్శక, నిర్మాతలుగా మారిన AP పల్లెటూరి తల్లికొడుకు.. ఒక్కో రూపాయి పోగేసి రూ.90 లక్షలతో సినిమా.. పవర్ స్టార్ చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్

by Anjali |
దర్శక, నిర్మాతలుగా మారిన AP పల్లెటూరి తల్లికొడుకు.. ఒక్కో రూపాయి పోగేసి రూ.90 లక్షలతో సినిమా.. పవర్ స్టార్ చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: ఒకప్పుడు కేవలం అగ్ర హీరోల మూవీస్‌కు మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కంటెంట్ బాగుంటే చాలు ఎంత చిన్నసినిమానైనా భారీ విజయం సాధిస్తుంది. ప్రస్తుతం దర్శక, నిర్మాతలను చూసి థియేటర్లకు బాట పడుతున్నారు. ఇలా రోజు రోజుకు మంచి మంచి కంటెంట్‌తో చిత్రాలు తెరకెక్కుతుంటే కొంతమందికి దర్శకుడిగా, నిర్మాతగా మారి సినిమాలు తెరకెక్కించాలని డ్రీమ్ ఏర్పడుతుంది. కాగా ఓ మహిళకు సేమ్ ఇలాగే సినిమాల పిచ్చితో నిర్మాతగా మారాలని కోరిక పుట్టింది. వివరాల్లోకెళ్తే.. వెంకటనర్సమ్మ అనే మహిళకు 14 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. అప్పుడప్పుడు భర్తతో కలిసి సినిమాలు చూసేందుకు థియేటర్ కు వెళ్లేది.

ఈ క్రమంలోనే సినిమాలు తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే తనలో ఆలోచన మొదలైంది. ఇందుకు చాలా డబ్బు కావాలని అనుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా... 29 లక్షల డబ్బు కూడబెట్టింది. ఈ మనీ కోసం వెంకటనర్సమ్మ కూలి పనులకు వెళ్లింది. టిఫిన్ బండి పెట్టింది. కోవిడ్ టైంలో కూడ రాగి జావా సెంటర్ నడిపింది. వెంకటనర్సమ్మ కు సినిమాల పిచ్చి వల్ల తన పెద్ద కుమారుడికి కోపం వచ్చి ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయాడట. దీంతో ఆమె బంధువుల సహాయంతో తన కొడుకుని వెతికి తీసుకొచ్చిందట. ఇక అప్పటి నుంచి తన కుమారుడు తన తల్లి రాసిన కథను దర్శక, నిర్మాతలకు వినిపించడానికి స్టూడియోల చుట్టూ తిరిగాడట. కానీ ఎవరు ముందుకు రాలేదు.

చివరకు డైరెక్టర్, నటుడు రవిబాబు కథ వినడానికి అంగీకరించాడట. ఈ స్టోరీ తెలంగాణలో దేవదాసీ వ్యవస్థలాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు ఉన్న మాతంగి ఆచారం ఆధారంగా ఉంది. స్త్రీని బలంగా చూపించడమే ఈ కథ యొక్క సారాంశం అట. దీనికి స్పిరిట్ (ఈజ్ నాట్ వన్) అనే టైటిల్ పెట్టారట. ఈ సినిమాలో రవిబాబు ముఖ్యపాత్రలో నటించాడు. చివరకు వెంకటనర్సమ్మ నిర్మాతగా, పెద్ద కుమారుడు రవీంద్రనాథ్ దర్శకుడిగా తమ కోరిక నెరవేరింది. మొత్తం 90 లక్షల రూపాయలతో రూపొందించిన ఈ చిత్ర పోస్టర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుద చేయబోతున్నారట. వెంకటనర్సమ్మ 20 సంవత్సరాల కల తీరడంతో కుటుంబం మొత్తం హర్హం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed