Mark zukerberg : మెరుపుల్.. మెరుపుల్..! సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్‌లో మార్క్ జుకర్ బర్గ్

by Javid Pasha |   ( Updated:2024-10-26 15:44:04.0  )
Mark zukerberg : మెరుపుల్.. మెరుపుల్..! సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్‌లో మార్క్ జుకర్ బర్గ్
X

దిశ, ఫీచర్స్ : మార్క్ జుకర్ బర్గ్.. ఈ టెక్ దిగ్గజం పేరు తెలియని వారు ప్రపంచంలో ఉండరంటే అతిశయోక్తి లేదు. ఫేస్ బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ మేనేజ్‌మెంట్ సంస్థల అయిన మెటాకు బాస్ ఆయనే. అయితే ప్రస్తుతం జుకర్ బర్గ్‌కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూ ఆసక్తిరేపుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడూ గ్రే టీషర్ట్‌ మాత్రమే ధరించే బర్గ్ ప్రస్తుతం కొత్త లుక్‌లో కనిపించారు. దీంతో బర్గ్ స్టైల్ మారిందంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

మెటా సీఈఓగా సాంకేతిక రంగంలో ఎన్నో విజయాలు సాధించిన జుకర్ బర్గ్ (Mark zukerberg) గ్రే కలర్ టీషర్ట్ నుంచి స్టైలిష్ అండ్ కలర్ ఫుల్ డ్రెస్సింగ్‌కు మారడం వెనుక కారణమేంటని పలువురు నెట్టిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు బాస్ స్టైల్ మారిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గా జుకర్ బర్గ్ తన భార్య బర్త్ డే సందర్భంగా ఆన్ థీమ్ డ్రెస్ ధరించడం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు వేదికలపై ఆయన కలర్ ఫుల్ టీషర్ట్స్ ధరించడం హాట్ టాపిక్ అయింది. ఏది ఏమైనా జుకర్ బర్గ్ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం అదుర్స్ అంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed