పూజలు, మొక్కులు ఎందుకు చేస్తుందో అసలు విషయం చేప్పేసిన అనుష్క..!

by Hamsa |   ( Updated:2023-09-17 05:21:43.0  )
పూజలు, మొక్కులు ఎందుకు చేస్తుందో అసలు విషయం చేప్పేసిన అనుష్క..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క్ శెట్టి అక్కినేనా నాగార్జున ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత మహేష్ బాబు, వెంకటేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. స్వీటీ ఇటీవల కాస్త సినిమాలకు దూరమైంది. మళ్లీ అనుష్క్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో అభిమానులను అలరిస్తుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్కకు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. గుళ్లు, గోపురాలు తిరగడం గురించి యాంకర్ అడగ్గా.. దానికి ఈ అమ్మడు స్పందిస్తూ.. చిన్నతనం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లేదాన్ని. నటిగా బిజీగా ఉండటంతో సమయం కుదరలేదు. ఇంట్లో ఇప్పటికీ సోమవారం, శుక్రవారం పూజలు నిర్వహిస్తాను. ఇటీవల ఖాళీగా ఉండటంతో ఆలయానికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నాను అని చెప్పింది. అలాగే పూజలు మొక్కులు పెళ్లి కోసమేనా? అని అడగడంతో.. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed