అనుష్క తల్లిని చూశారా.. ఫిదా అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2023-08-01 10:11:12.0  )
అనుష్క తల్లిని చూశారా.. ఫిదా అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అందాల జేజేమ్మ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. అనుష్క ఫ్యామిలీ గురించి అతి తక్కువ మందికే తెలుసు. తాజాగా తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా అనుష్క షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు ‘హ్యాపీ బర్త్‌డే మా’ అంటూ వాళ్ల అమ్మతో ఉన్న ఫొటోను షేర్ చేసింది అనుష్క. ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. ‘‘అత్తగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’, ‘‘మీ అందమే అనుష్కాకి వచ్చింది’’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Also Read: పబ్లిక్‌లో కాలు పైకెత్తి లోదుస్తులు కనిపించేలా రెచ్చిపోయిన శ్రియ.. పిక్స్ వైరల్

Advertisement

Next Story