Anushka Shetty :పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనుష్క.. ఐదుసార్లు జరిగిందా?

by Anjali |   ( Updated:2023-06-14 11:31:23.0  )
Anushka Shetty :పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనుష్క.. ఐదుసార్లు జరిగిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా సౌత్‌లో సపరేట్ ఫ్యాన్స్ బేస్ సొంతం చేసుకుంది. కన్నడ అమ్మాయి అయినా తెలుగు సినిమాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. గతంలో ఈ బ్యూటీ పలానా హీరోతో లవ్‌లో ఉందని చాలా వార్తలు వినిపించాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనుష్కకు చాలా మందితో ఎఫైర్ ఉందని రూమర్స్ వచ్చాయి.

అయితే తాజాగా.. స్వీటీ నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. ఆమె పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాగా.. ‘‘నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ, వాస్తవంగా నాకు సోషల్ మీడియా మాత్రం నాకు ఐదుసార్లు పెళ్లి చేసింది.’’ మీడియా వారు ఎవరితో అని ప్రశ్నించగా..‘‘ప్రకాశ్ కోవెల, మూడి నాగార్జున, సుమంత్, గోపిచంద్’’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఇక ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమ వ్యవహారం గురించి నెట్టింట ఏ విధంగా వార్తలొచ్చాయో చెప్పుకోనవసరం లేదు. కానీ వీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Also Read: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ప్లాన్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Advertisement

Next Story