ప్రభాస్‌ను ముద్దు పేరుతో పిలిచి సీక్రెట్‌ బయటపెట్టిన అనుష్క..! పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-05-01 10:23:09.0  )
ప్రభాస్‌ను ముద్దు పేరుతో పిలిచి సీక్రెట్‌ బయటపెట్టిన అనుష్క..! పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి కలిసి ‘డార్లింగ్’ సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిపై స్విటీ స్పందిస్తూ తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ల జోడి గురించి సోషల్ మీడియాలో మరోసారి ఓ చర్చ జరుగుతోంది. అయితే అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. దాన్ని ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. అది చూసిన అనుష్క, ప్రభాస్ పెట్టిన పోస్ట్‌ను షేర్ చేస్తూ ‘థాంక్యూ పుప్స్’ అంటూ రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు ప్రభాస్ ముద్దు పేరు ఇదా అని వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నట్లు మళ్లీ సోషల్ మీడియాలో మళ్లీ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.



Advertisement

Next Story