Anusha Dandekar : ఆ నొప్పి భరించలేక సర్జరీ చేయించుకున్నా.. ఇప్పుడు సుఖంగా ఉంది

by Prasanna |   ( Updated:2023-06-14 06:24:55.0  )
Anusha Dandekar : ఆ నొప్పి భరించలేక సర్జరీ చేయించుకున్నా.. ఇప్పుడు సుఖంగా ఉంది
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ అనూషా దండేకర్ కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన హెల్త్‌కు సంబంధించిన మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన నటి.. అండాశయంలో పెరుగుతున్న గడ్డను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ.. ‘రికవరీ పీరియడ్ చాలా కష్టంగా ఉంది. అయినా నేను నిజంగా అదృష్టవంతురాలినే. నా అండాశయానికి ఎలాంటి హాని జరగకుండానే చికిత్స పూర్తైంది. పలు టెస్టుల్లో లోపల మరికొన్ని చిన్న చిన్న గడ్డలున్నట్లు కనిపించాయి. కానీ ఆపరేషన్ తర్వాత పార్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయన్నారు. ఐయామ్ సూపర్ లక్కీ. ఇప్పుడు నా శరీరం, మనసు చాలా బాగుంది. మరి కొన్ని వారాల్లో పూర్తిగా కోలుకుని మీ ముందు ఉంటా’ అంటూ తన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది


Advertisement

Next Story