'ది కశ్మీర్ ఫైల్స్'తో భారత్‌కు ప్రమాదమే: హాలీవుడ్ ఫిల్మ్ మేకర్

by sudharani |
ది కశ్మీర్ ఫైల్స్తో భారత్‌కు ప్రమాదమే: హాలీవుడ్ ఫిల్మ్ మేకర్
X

దిశ, సినిమా: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ మూవీ 'ఆస్కార్' నామినేషన్‌కు పంపించకూడదంటూ ఇటీవల అనురాగ్ కశ్యప్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా అనురాగ్‌కు మద్దతుగా నిలిచిన ప్రముఖ కెనడియన్ ఫిల్మ్ మేకర్ డైలాన్ మోహన్ గ్రే.. 'అవును.. నిజం చెప్పాలంటే 'ది కశ్మీర్ ఫైల్స్' (ద్వేషపూరిత, రివిజనిస్ట్) కళాత్మక యోగ్యత లేని చెత్త సినిమా.

ఒకవేళ ఆస్కార్ బోర్డు దీన్ని ఎంపిక చేస్తే భారతదేశానికి ప్రమాద సూచికలు వచ్చినట్లే. దేశంలో మిగిలివున్న మంచిని కాపాడటానికి అనురాగ్ కశ్యప్ ప్రయత్నిస్తున్నారు' అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇదిలావుంటే అనురాగ్ ప్రకటనతో మనస్తాపం చెందిన వివేక్.. తన చిత్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి కొంతమంది నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. 'బాలీవుడ్‌లో ఇదొక దుర్మార్గపు ప్రచారం. 'కశ్మీర్ ఫైల్స్‌' ఆస్కార్‌కు వెళ్లకుండా అనురాగ్ నాయకత్వంలో ప్రచారం జరుగుతోంది' అని ఇండైరెక్ట్‌గా ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story