భార్యతో మసాజ్ సెంటర్ లో గలీజు పనులు చేయించిన డైరెక్టర్..

by Sujitha Rachapalli |
భార్యతో మసాజ్ సెంటర్ లో గలీజు పనులు చేయించిన డైరెక్టర్..
X

దిశ, సినిమా : బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన చాలా నిజాయితీ గల మనిషని కొనియాడాడు. ఆయన సినిమా కోసం పోరాడినట్లే.. తను కూడా ఫైట్ చేస్తే బాగుండేదని తాజా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ఆయన సినిమాల విషయంలో నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వారికి ఇచ్చిపడేసిన తీరు బాగుంది అన్నాడు. నిజంగానే పే బ్యాచెస్ ఉన్నాయని.. దాని ఆధారంగానే రివ్యూలు ఇవ్వబడతాయని ఇండైరెక్ట్ గా చెప్పాడు. అంతేకాదు సెన్సార్ విషయంలోనూ సందీప్ చాలా పోరాడాడని.. కానీ తన సినిమా ' బాంబే వెల్వెట్ ' కోసం తాను ఫైట్ చేయకపోవడంపై రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్లు బాధపడ్డాడు.

అంతేకాదు తన ప్రతి సినిమా రివ్యూ పర్సనల్ గా జరిగిందని.. 'దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్' మూవీ విషయంలో ఇది మరీ ఎక్కువైందని రాశారని తెలిపాడు. అప్పుడు కల్కి కీయోచ్లిన్ ను పెళ్లి చేసుకున్న తాను.. తననే లీడ్ రోల్ లో తీసుకున్నానని చెప్పాడు. అయితే ఒక భర్త అయి ఉండి ఇంత బరితెగించిన పాత్రలో భార్యను చూపించాడంటే.. ఆయనను ఏమనుకోవాలని విమర్శించారని బాధపడ్డాడు. కాగా కల్కి మసాజ్ సెంటర్ లో ఇల్లీగల్ థింగ్స్ చేసే వ్యక్తిగా ఉంటుంది. కాగా ప్రతి సినిమాకు ఇలాంటి నెగేటివిటి ఎదుర్కొన్నానని.. అందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed