టాలీవుడ్ యంగ్ హీరోతో అనుపమ పరమేశ్వరన్ రిలేషన్.. పెళ్లి కూడా చేసుకోబోతుందా?

by Hamsa |   ( Updated:2024-04-23 06:08:33.0  )
టాలీవుడ్ యంగ్ హీరోతో అనుపమ పరమేశ్వరన్ రిలేషన్.. పెళ్లి కూడా చేసుకోబోతుందా?
X

దిశ, సినిమా: కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే కుర్రాళ్లలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ యంగ్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ పాపులారిటీని పెంచుకుంటుంది. ఇటీవల సిద్దు జొన్నలగడ్డ సరసన అనుపమ, ‘టిల్లు స్వ్కేర్’ మూవీలో నటించింది. ఈ చిత్రం మార్చి 29న విడుదలై సూపర్ హిట్ అందుకోవడంతో పాటుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అనుపమ పలు బోల్డ్ సీన్స్‌లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి సక్సెస్ అందుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, అనుపమ పరమేశ్వరన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ హీరోతో అనుపమ పరమేశ్వరన్ రిలేషన్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. అతనితో ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ.. ఫుల్ ఎంజాయ్ చేస్తుందట. అతను మంచి ఫ్రెండ్ కావడంతో ప్రేమలో పడిందట. వీరిద్దరు తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. అయితే అతను ఫ్రెండ్ మాత్రమే అని అనుపమ చెప్పినప్పటికీ వార్తలు ఆగడం లేదు. గత కొద్ది కాలంగా వీరిద్దరూ రిలేషన్‌‌లో ఉన్నారని అంతా చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం అనుపమకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.

Advertisement

Next Story