Anupama Parameswaran:అనుపమ పరమేశ్వరన్ చిన్ననాటి క్యూట్ పిక్స్ వైరల్.. ముచ్చటపడిపోతున్న ఫ్యాన్స్

by Anjali |
Anupama Parameswaran:అనుపమ పరమేశ్వరన్ చిన్ననాటి క్యూట్ పిక్స్ వైరల్.. ముచ్చటపడిపోతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ప్రేమమ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ‘జేమ్స్ & ఆలిస్, కోడి, శతమానం భవతి, జోమోంటే సువిశేషాలు, ఉన్నది ఒకటే జిందగి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే, నటసార్వభౌమ, రౌడీ బాయ్స్, అంటే సుందరానికి, కార్తికేయ 2, సీతాకోకచిలుక, 18 పేజీలు’ వంటి తెలగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా రీసెంట్‌గా టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్వ్కేర్’ సినిమాలో నటించి యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది.

మునుపెన్నడు కనిపించని విధంగా ఈ మూవీలో కనిపించి కుర్రాళ్ల నుంచి ముసలివారికి సైతం చెమటలు పట్టించింది. ఆ రేంజ్‌లో హాట్‌నెస్ వలకబోసింది మరీ ఈ యంగ్ బ్యూటీ. ఇకపోతే సెలబ్రిటీల చిన్న నాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం తరచూ చూస్తూనే ఉంటాం.తాజాగా కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన అనుపమ చిన్నప్పటి ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌ అయితే లవ్ సింబల్స్ జోడించి లవ్‌లీ పిక్స్ అంటూ తెగ ముచ్చటపడిపోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ చైల్డ్ హుడ్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Advertisement

Next Story