Anupama Parameswaran :లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అనుపమ.. ‘లాక్ డౌన్’ ఫస్ట్ లుక్

by Hamsa |   ( Updated:2024-05-06 14:44:33.0  )
Anupama Parameswaran :లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అనుపమ.. ‘లాక్ డౌన్’ ఫస్ట్ లుక్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ‘టిల్లు స్క్వేర్’ హిట్ తర్వాత ఫుల్ ఫామ్‌లో ఉంది. వరుస సినిమాలు ప్రకటిస్తూ క్రేజీ బ్యూటీగా దూసుకుపోతుంది. ఇటీవల అనుపమ పరదా అనే టైటిల్ రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ కాన్పెప్ట్‌తో రాబోతుంది. ఇది తెలుగు, తమిళ్‌లో విడుదల కాబోతుంది. తాజాగా, నేడు అనుపమ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నట్లు తమిళ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ వారు అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

అంతేకాకుండా అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీనికి లాక్ డౌన్ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఇందులో ఆమె బాధతో అరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ సినిమాకు ఏఆర్ జీవా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కేవలం తమిళ్‌లోనే విడుదల కానుందా లేక తెలుగులో కూడా రాబోతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Click here for the first look of Anupama Parameswaran upcoming film 'LOCKDOWN'

Advertisement

Next Story