Anupama Parameshwaran: ఆ యంగ్ హీరోయిన్ లవర్‌తో అనుపమ డేటింగ్.? కానీ చివరికి..

by Kavitha |
Anupama Parameshwaran: ఆ యంగ్ హీరోయిన్ లవర్‌తో అనుపమ డేటింగ్.? కానీ చివరికి..
X

దిశ, సినిమా: ‘ప్రేమమ్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత అఆ, శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, రౌడీ బాయ్స్ వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ‌్‌కు ఎదిగింది. కానీ ఎప్పుడూ ఈ బ్యూటీ బోల్డ్ పాత్రలో నటించలేదు. గ్లామరస్‌గా కనిపించిన సినిమాలు కూడా లేవు. కానీ, ఇటివల వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీలో ఎప్పుడు కనిపించనంతగా బోల్డ్‌గా, గ్లామర్‌తో రెచ్చిపోయింది. అంతే కాకుండా లిల్లీ పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి. దీంతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా మంది ఈ బ్యూటీ నటనకు ఫిదా అయ్యారు కూడా. ఇక ఈ మూవీ తర్వాత నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ అమ్మడుపై చాలా రూమర్స్ వినిపించగా తాజాగా మరో పుకారు షికారు చేస్తుంది. అదేంటంటే? అనుపమ పరమేశ్వరన్..గుజరాతీ నిర్మాత, యానిమేషన్ డైరెక్టర్, నటుడు అయినటువంటి చిరంజీవి మక్వానా అనే వ్యక్తితో ప్రేమలో పడిందంట. కానీ, ఈ మధ్యనే ఆ వ్యక్తితో బ్రేకప్ కూడా చెప్పుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇదే గుజరాతి హీరో చిరంజీవి మక్వానాతో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కూడా ప్రేమలో ఉన్నదట. దీంతో మెహ్రీన్‌తో ఆయన లవ్ మ్యాటర్ తెలిసిన అనుపమ ఆయనకు బ్రేకప్ చెప్పినట్టు టాక్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story