మగాళ్లు Sex కోసం Love ను అడ్డుపెట్టుకుంటున్నారు: Anu Aggarwal

by sudharani |   ( Updated:2022-12-28 07:46:29.0  )
మగాళ్లు Sex కోసం Love ను అడ్డుపెట్టుకుంటున్నారు: Anu Aggarwal
X

దిశ, సినిమా : ప్రముఖ సీనియర్ నటి, 1990లో వచ్చిన 'ఆషికీ' ఫేమ్ అను అగర్వాల్ అసలైన ప్రేమ ఎలా ఉంటుందో చెప్పింది. ఇన్నాళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్న ఆమె.. వెనుకబడిన పిల్లల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ఇప్పటికైతే సింగిల్ స్టేటస్‌తోనే సంతృప్తిగా ఉన్నానని తెలిపింది.

'నేనెప్పుడూ ఓపెన్ పర్సన్‌గా ఉండేందుకు ఇష్టపడతా. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎవరూ ఊహించలేరు. ప్రస్తుతానికి పిల్లల నుంచి చాలా ప్రేమను పొందుతున్నా. ఇది నిజాయితీతోకూడిన అమాయకమైన ప్రేమ. ఇది సెక్స్ కాదు. పురుషుడితో ప్రేమ అవసరం వేరే విధంగా ఉంటుంది. నాకు తెలిసి అది నిజమైన లవ్ కాదు. ప్రేమలో ఉన్న వ్యక్తులు నిరంతరం మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే ఆరాటపడతారు. నాకు అలాంటిది అవసరం లేదు' అని అగర్వాల్ వెల్లడించింది. అలాగే సరైన భాగస్వామిని కలిగి ఉండటమే మహిళలు గొప్పగా చెప్పుకునే విషయమన్న ఆమె.. ప్రేమ భావనను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి : దారుణం.. కన్నతల్లిపై కొడుకు అత్యాచారం.. తండ్రి పక్కనే ఉన్నా..

Advertisement

Next Story