నాగార్జున ‘నా సామిరంగ’ మూవీలోకి మరో యంగ్ హీరో ఎంట్రీ?

by Aamani |   ( Updated:2023-09-20 13:38:57.0  )
నాగార్జున ‘నా సామిరంగ’ మూవీలోకి మరో యంగ్ హీరో ఎంట్రీ?
X

దిశ,సినిమా : టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ‘నా సామిరంగ’ అనే కొత్త ప్రాజెక్ట్‌‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబందించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నాగార్జున మునుపెన్నడూ చూడని విధంగా కొత్త లుక్‌లో కనిపించాడు. మొత్తానికి ఈ సినిమా కోసం నాగార్జున మాస్ మేకోవర్‌లోకి మారిపోయాడు. విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త హైప్ పెంచేస్తునే ఉంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో మరో యంగ్ హీరోకు కూడా ఛాన్స్ ఉందని టాక్. అయితే ఈ పాత్ర కోసం ఇటీవల అల్లరి నరేష్ పేరు వినిపించగా ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు వినిపిస్తోంది. మరి ఎవరినీ ఫైనల్ చేస్తారో చూడాలి.

Advertisement

Next Story