షోయబ్‌కు మించి డబుల్ ట్విస్ట్ ఇచ్చిన సానియా మీర్జా.. షాక్‌లో ఫ్యాన్స్!

by Anjali |   ( Updated:2024-01-26 14:08:50.0  )
షోయబ్‌కు మించి డబుల్ ట్విస్ట్ ఇచ్చిన సానియా మీర్జా.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా - పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సానియా సోషల్ మీడియా వేదికన పలు ట్రోల్స్‌ను ఎదుర్కొంటుంది. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో సానియా విడాకులకు కారణమయ్యాడంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. సానియా మాజీ భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ కు చెందిన సనా జావేద్ అనే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. కానీ సానియా మీర్జా-షోయబ్‌కు ఓ కుమారుడు కూడా ఉండటంతో ఫ్యాన్స్ వీరి డివోర్స్‌ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.

అలాగే విడాకులు తీసుకున్నారు కదా.. ఇక ఎవరి లైఫ్ వారిదని నెటిజన్లు సైలెంట్‌గా ఉండిపోతారా? వారి గతంలో జరిగిన సంఘటనలకు తెరపైకి తీసుకువచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వారి మనోభావాలు దెబ్బతీస్తుంటారు. అయితే సానియా మీర్జా-షోయబ్ వివాహం జరగక ముందు సానియాకు వేరే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ జరిగిందట. అతడు ఎవరో కాదు.. సానియా చిన్ననాటి ఫ్రెండ్ సోహ్రాబ్ మీర్జాతో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం అయ్యిందట.

ఇక వివాహానికి ముందు సానియా.. షోయబ్ తో లవ్ లో పడిందట. ఈ కారణంగా సోహ్రాబ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని .. పేరెంట్స్‌ను ఒప్పించి షోయబ్ ను పెళ్లి చేసుకుందట. ఇక ఈ విషయాన్ని జనాలు నెట్టింట వైరల్ చేస్తూ.. ‘‘సోహ్రాబ్ ను కనుక వివాహం చేసుకుంటే సానియా జీవితం ఇలా కాకపోవు’ అంటూ పరోక్షంగా పలువురు కామెంట్స్ చేయగా.. సానియాకు ఇంతముందే మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయ్యిందా అంటూ మరికొంతమంది షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed