- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండస్ట్రీలో విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ కపుల్?
దిశ, వెబ్‌డెస్క్ : సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. చిత్ర పరిశ్రమలో నటీ నటుల మధ్య ప్రేమ ఎంత త్వరగా పుడుతుందో విడిపోవడం కూడా అంతే త్వరగా జరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం చాలా మంది నటులు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇక టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని, నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరి బాటలోనే కోలీవుడ్‌లోని మరో జంట వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
21 సంవత్సరాలకు పైగా వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఓ జంట అనూహ్యంగా విడాకులు తీసుకోబోతుంది అనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ జంట ఎవరో కాదు, స్టార్ హీరో అజిత్, షాలీని. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. వీరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలు కోడైకూస్తున్నాయి. అంతే కాకుండా ఇన్ని రోజులు అన్నీ సర్దుకపోయిన షాలీని ఈ మధ్య సర్దుకోవడం లేదని, ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయని, అందుకే అజిత్ షాలీనికి విడాకులివ్వబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ రమేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చినట్ల అయిందని కొందరు గుస గుసలాడుతున్నారు. ఆయన ఏం అన్నారంటే.. అజిత్, షాలీని లవ్ చేసుకుంటున్న సమయంలోనే నేను వద్దని చెప్పాను అయినా వారు వినకుండా పెళ్లి చేసుకున్నారు. భార్యభర్తల మధ్య గొడవలు అనేవి సహజం. వారి విడిపోతారని నేను అనుకోవడం లేదు. ఇన్ని రోజులు ఎలాఅయితే గుట్టుగా వారి సంసారం సాగిందో ఇప్పుడు కూడా అలానే సాగాలని కోరుకుంటున్నా అని తెలిపారు. దీంతో నిజంగానే వారు విడిపోతున్నారని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
పెళ్లికి గెస్ట్‌లా వచ్చిన విష్ణు.. కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్..?