సూపర్‌స్టార్-జక్కన్న సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్

by Anjali |   ( Updated:2024-02-20 07:46:43.0  )
సూపర్‌స్టార్-జక్కన్న సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇండియానా జోన్స్ లాంటి కథతో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంతో జక్కన్న తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి మహేష్ బాబు సిద్ధమవుతుండగా.. డైరెక్టర్ జక్కన్న స్క్రిప్ట్ వర్స్ చూసుకుంటున్నారు.

స్టార్ దర్శకుడి సినిమా వస్తుందంటే నెటిజన్లు ఆ మూవీలో హీరో రోల్ ఏంటి? ఎలా కనిపించనున్నాడని సోషల్ మీడియాలో ఆసక్తితో చర్చించడం మొదలు పెడతారు. తాజాగా ఈ మూవీలో ప్రిన్స్ పాత్ర ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో సూపర్ స్టార్ రోల్ చాలా ఇంటెన్స్ గా ఉండనుందట. సాలిడ్ వేరియేషన్స్ తో మస్త్ షేడ్స్ ఉన్న రోల్ లో సూపర్ స్టార్ కనిపించనున్నాడట.

ఈ హీరో లుక్ కూడా చేంజ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రిన్స్ ఇలాంటి క్యారెక్టర్‌లో చేయలేదని, మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని సూపర్ స్టార్ అభిమానులు నెట్టింట తీవ్ర చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ మూవీకి ‘మహారాజా’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలసిందే.

Read More..

11 ఏళ్ల వయసులో మహేష్ బాబు నడిపిన మొదటి బైక్ ఏంటో తెలుసా?

Advertisement

Next Story