- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సలార్’ సినిమాలో మరో సెన్సేషనల్ హీరో!
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ‘ఆదిపురుష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిక్స్‌డ్ టాక్‌తో ఈ సినిమా రూ.450 కోట్లు వసూలు చేసింది. ఇక డార్లింగ్ నెక్ట్స్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఇందుకు మెయిన్ రీజన్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం. కేజీఎఫ్ రెండు పార్టులతో ఈ క్రేజీ డైరెక్టర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫుల్ మాస్ స్టోరీతో సలార్ తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతో రక్షిత్ శెట్టి హిట్ అందుకున్నారు. ఇటీవలే 777 చార్లీ సినిమాతో పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సలార్ మూవీలో రక్షిత్ శెట్టి నటిస్తుండటంతో ఈ హీరో పాత్ర ఎలా ఉంటుందో అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Read More..
Anasuya Bharadwaj : ‘పుష్ప2’ షూటింగ్ స్పాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. న్యూ లుక్‌తో అదుర్స్