మరో రికార్డు సాధించిన ‘కుర్చీ’.. ఈసారి వేరే లెవల్ అంతే..!

by Disha Web Desk 7 |
మరో రికార్డు సాధించిన ‘కుర్చీ’.. ఈసారి వేరే లెవల్ అంతే..!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా.. మిక్సిడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికి కలెక్షన్లు మాత్రం భాగానే రాబట్టింది. అయితే.. ఇందులో ‘ఆ కుర్చీ మడతపెట్టి’ సాంగ్ మాత్రం మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సాంగ్‌లో మహేశ్ బాబు, శ్రీలీల డాన్స్ పర్ఫామెన్స్‌కు వేరే లెవల్. వీరిద్దరి స్టెప్పులకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

ఇక సోషల్ మీడియాలో అయితే.. ఎక్కడ విన్న, చూసిన ఇదే పాట ట్రెండ్ అవుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్టెప్పులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా 200 మిలియన్లకు పైగా వ్యూస్‌తో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. మహేశ్ బాబు కెరీర్‌లో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన రెండో సాంగ్‌గా ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ నిలిచింది. మొదటి స్థానంలో 245 మిలియన్స్ వ్యూస్‌తో ‘కళావతి’ సాంగ్ నిలిచింది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Read More...

నీకు సరైన మగాడు దొరికాడు.. డైరెక్టర్ శంకర్ కూతురిపై కీర్తి సురేష్ కామెంట్స్.. ఆ హీరోతో రాత్రి గడిపితేనే అంత మా...



Next Story

Most Viewed