రెండో పెళ్లికి సిద్ధమైన చైతూ.. ఇంకా సమంత జ్ఞాపకాలతో వైరల్ అవుతున్న మరో పోస్ట్

by Kavitha |
రెండో పెళ్లికి సిద్ధమైన చైతూ.. ఇంకా సమంత జ్ఞాపకాలతో వైరల్ అవుతున్న మరో పోస్ట్
X

దిశ, సినిమా: ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం హాట్ హాట్‌గా నడుస్తున్న టాపీక్‌ ఏదైనా ఉంది అంటే అది నాగచైతన్య శోభితల ఎంగేజ్‌మెంట్‌కు సంబంధిచిన న్యూసే.. ఇన్ని రోజులు వచ్చిన పుకార్లను నిజం చేస్తూ సడన్‌గా నిశ్చితార్ధం చేసుకుని అందరికీ షాక్‌కు గురిచేశారు. ఇక ఇది చాలదు అన్నట్లు మళ్లీ వేణు స్వామి ఎంట్రీ ఇచ్చి వీరికి కూడా బ్రేకప్..ఈ ఇద్దరు కూడా విడాకులు తీసుకోవడం ఖాయం.. కొద్ది సంవత్సరాలే కలిసి ఉంటారు అంటూ తనకు తెలిసిన జాతకం ఏదో చెప్పేశారు. దీంతో వీరు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు.

ఇదిలా ఉంటే.. ఓ పక్క వీరి ఎంగేజ్మెంట్ విని అక్కినేని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే మరోపక్క సమంతకు సంబంధించిన పాత జ్ఞాపకాలు చైతూని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యకు సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో అది చూసిన చాలా మంది జనాలు నాగచైతన్య ఇంకా సమంతని మర్చిపోలేక పోతున్నాడని.. రెండో పెళ్లికి రెడీ అయిన మొదటి భార్య పైన ప్రేమ తగ్గలేదంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

మరి ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే?.. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య సమంతకి సంబంధించిన ఫొటోలు అన్నీ డిలీట్ చేశారు. ఇలా అన్ని ఫొటోస్ డిలీట్ చేసేసి కేవలం మజిలీ సినిమా పోస్టు మాత్రమే తన ఇన్‌స్టా ఖాతాలో ఉంచుకున్నారు. కానీ, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే చైతన్య ఈ పోస్ట్ మాత్రమే కాకుండా సమంతకు సంబంధించిన ఇంకో పోస్ట్‌ను కూడా అలానే ఉంచుకున్నారు. నాగచైతన్య సమంత ఇద్దరూ కలిసి రేస్ కార్‌తో దిగిన ఫోటో ఇంకా చైతు సోషల్ మీడియా ఖాతాలో అలాగే ఉంది. అందులో చై సామ్ చెరో పక్క నిల్చొని బ్యాక్ సైడ్ నుంచి తీసిన స్నాప్‌చాట్ ఫోటోతో పాటు త్రో బ్యాక్ మిస్సెస్ అండ్ ది గర్ల్ అని క్యాప్షన్ కూడా పెట్టిన పిక్ అలానే ఉంది. దీంతో నాగచైతన్య ఇంకా సమంత జ్ఞాపకాల్లో ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమందేమో మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యి సమంతని ఇంకా ఎందుకు మీ ఫోన్‌లో ఆ ఫొటోను ఉంచుకున్నారు డిలీట్ చేసేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(photos link credits to chayakkineni instagram id)

Advertisement

Next Story