పవన్ కళ్యాణ్ గెలుపు వెనుక మరో కీలక వ్యక్తి!.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2024-06-14 10:03:22.0  )
పవన్ కళ్యాణ్ గెలుపు వెనుక మరో కీలక వ్యక్తి!.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
X

దిశ, సినిమా : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ వేదికపై మెగా ఫ్యామిలీ కూడా పాల్గొన సందడి చేసింది. అయితే పవన్ కళ్యాణ్‌తో పాటు అక్కడికి వచ్చిన ఓ మహిళ మాత్రం పవన్ మాట్లాడుతుండగా ఇంట్రెస్ట్‌గా తన మొబైల్‌లో పవన్‌ను వీడియో తీయసాగింది. ఈ దృశ్యం పవర్ స్టార్ అభిమానులతోపాటు ప్రజలందరి దృష్టినీ ఆకర్షించగా ప్రజెంట్ ఆమె గురించి పలువురు చర్చించుకుంటున్నారు. ఇంతకీ వ్యక్తి ఎవరో కాదు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా.

అసలు పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవాకు జోడీ ఎలా కుదిరింది? ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అనే సందేహాలు కూడా కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే ముందుగా ఈమె ఒక రష్యన్ మోడల్. అక్కడ ఉంటూనే పలు సౌత్ సినిమాలకు కూడా వర్క్ చేసిందట. అలాగే పవన్‌ ఒకప్పటి సినిమా ‘తీన్ మార్‌’లో పవన్‌తోపాటు అన్నా లెజ్నెవా కూడా కీ రోల్ పోషించింది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు.

అయితే అప్పటికే అన్నా లెజ్నెవాకు పెళ్లి అయిపోయి భర్త ఉన్నాడు. పవన్‌కు కూడా అప్పటికే పెళ్లి అయింది. అయినప్పటికీ వీరిద్దూ లవ్‌లో పడ్డాక సహజీవనం మొదలు పెట్టి, 2013లో పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరికి కొడుకు పుట్టగా మార్క్ శంకర్ పవనోవిచ్ అని పేరు పెట్టారు. అప్పటికే లెజ్నెవాకు మొదటి భర్త వల్ల పుట్టిన ఓ అమ్మాయి అంజనా పావ్నోవా ఉంది. కాగా గతేడాది అన్నా లెజ్నెవాకు, పవన్‌కు మధ్య మనస్పర్థలు వచ్చి విడిగా ఉంటున్నట్లు రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ప్రమాణ స్వీకారోత్సవానికి కలిసి రావడంతో వాటికి తెరపడింది.

ఇక పవన్ నామినేషన్ వేసినప్పటి నుంచి గెలుపొందే వరకు ప్రతి విషయంలోనూ అన్నా లెజ్నెవా అతనికి సపోర్టుగా నిలిచిందని, భార్యగా, సలహాదారుగా కీలకపాత్ర పోషించిన నాన్ పొలిటీషియన్ అని పలువురు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేదికపై మెగా ఫ్యామిలీ, పవన్ మూడో భార్య అన్నా లెజ్నెవాతోపాటు విడాకులు తీసుకొని సపరేట్‌గా ఉంటున్న పవర్ స్టార్ రెండవ భార్య సంతానం అయిన అకీరానంద్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

Read More : ‘ప్లీజ్.. ఆ పని చేయకండి ’.. అభిమానులకు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కీలక రిక్వెస్ట్

Advertisement

Next Story

Most Viewed