అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే.. రాబోతున్న మరో గుడ్ న్యూస్..!

by Hamsa |   ( Updated:2024-08-09 04:52:17.0  )
అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే.. రాబోతున్న మరో గుడ్ న్యూస్..!
X

దిశ, సినిమా: ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కానీ నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వార్తలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇన్నాళ్లు సీక్రెట్‌గా రిలేషన్ మెయింటేన్ చేసి ఈ జంట సడెన్‌గా నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గత కొద్ది కాలంగా డేటింగ్‌లో ఉన్నప్పటికీ ఎన్ని వార్తలు వచ్చిన రియాక్ట్ కాకుండా సైలెంట్‌గా ఉన్నారు.

ఇక ఆగస్టు 8న నాగచైతన్య, శోభిత ఒక్కటి కాబోతున్నట్లు అధికారికంగా నాగార్జున ప్రకటించడంతో అందరూ వీరిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత చైతు మరోసారి పెళ్లి చేసుకోడని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ ప్రేమ వివాహం చేసుకోబోతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ రాబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

పర్సనల్ లైఫ్‌లో ఒక అడుగు ముందుకు వేసిన చై రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఇక కెరీర్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం తాపత్రయ పడుతున్నాడు. ఈ క్రమంలోనే సూపర్ హిట్ విరుపాక్ష మూవీ డైరెక్టర్‌ కార్తిక్ వర్మ దండుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని నాగచైతన్య ముందుగానే అన్ని ప్లాన్స్ వేసుకున్నారట. అక్టోబర్‌లో దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పిన చైతు.. కెరీర్‌ విషయంలో శుభవార్తను తొందరలోనే ప్రకటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రెండు గుడ్ న్యూస్‌లను తెలుసుకున్న అక్కినేని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed