- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో వివాదంలో ప్రభాస్ 'ఆదిపురుష్'
దిశ, డైనమిక్ బ్యూరో: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రానికి స్టార్టింగ్ నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఆదిపురుష్ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికెట్ పొందకుండానే చిత్ర నిర్మాతలు సినిమా ప్రోమోను విడుదల చేశారని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని కుల్దీప్ తివారీ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. అనుమతులు లేకుండా ప్రోమో విడుదల చేయడంతో పాటు ఇందులో సీతా దేవి పాత్రలో నటిస్తున్న కృతి సనన్ ధరించిన కాస్ట్యూమ్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని కుల్దీప్ పేర్కొన్నారు. సీతారాములపై ప్రజల్లో లోతైన విశ్వాసం ఉందని కానీ సినిమాలో వాటిని ప్రజల నమ్మకానికి విరుద్ధంగా చూపించారని అలాగే సినిమాలో రావణుడి లుక్ కూడా అభ్యంతరకరంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ బిఆర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది.