మహేష్‌కు ధీటుగా స్టార్ విలన్.. '#SSMB 28' నుంచి మరో బిగ్ అప్‌డేట్!

by Harish |   ( Updated:2023-02-13 09:15:36.0  )
మహేష్‌కు ధీటుగా స్టార్ విలన్.. #SSMB 28 నుంచి మరో బిగ్ అప్‌డేట్!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న తాజా చిత్రం '#SSMB 28'. సితార ఎంటర్‌టైన్మెంట్స్, హారిక హాసిని బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ నుంచి మరో అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే హీరోయిన్‌గా పూజా‌హెగ్డే, శ్రీలీల ఎంపికైనట్లు అధికారిక ప్రకటించిన మేకర్స్.. విలన్‌గా జగపతి బాబును సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రం మహేష్, త్రివిక్రమ్‌లతోపాటు మహేష్, జగపతి బాబులకు కూడా మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: నిజంగా ఇదొక అద్భుతం.. 'ఆర్ఆర్ఆర్'కు ఫిదా అయ్యాను!



Advertisement

Next Story