shraddha kapoor: బాలీవుడ్ లో మరో బిగ్ బ్రేకప్.. ఇన్‌స్టాగ్రామ్‌లో అతన్ని అన్ ఫాలో చేసిన స్టార్ హీరోయిన్

by Prasanna |   ( Updated:2024-08-07 05:57:19.0  )
shraddha kapoor: బాలీవుడ్ లో మరో బిగ్ బ్రేకప్..  ఇన్‌స్టాగ్రామ్‌లో  అతన్ని అన్ ఫాలో చేసిన  స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా : ఈ మధ్య సెలెబ్రిటీల లవ్ బ్రేకప్, డివోర్స్ న్యూస్ లు బాగా ఎక్కువైపోయాయి. మూడేళ్ళ క్రిత్రం సమంత, నాగ చైతన్య కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారన్నమనకి విషయం తెలిసిందే. ఈ జంట విడిపోయిన తర్వాత నుంచి ఫేమ్ ఉన్న స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు వారి వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇక్కడ ప్రేమకి విలువ లేదు పెళ్లికి కూడా లేదు. మ్యారేజ్ చేసుకునే ముందు ఉన్న ప్రేమ, పెళ్ళి తర్వాత ఎక్కడికి పోతుందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ జంట లవ్ బ్రేకప్ కి సిద్ధమైంది.

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో మూవీతో తెలుగు వారికీ బాగా దగ్గరైంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ అందర్ని అలరిస్తోంది. ‘స్త్రీ 2’ సినిమాలో లీడ్ రోల్లో నటించింది. ఈ మూవీ అతి త్వరలో మన ముందుకు రానుంది. శ్రద్ధా కపూర్ వ్యక్తిగత కారణాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కో-డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ మోడీతో ఈ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రేమాయణం నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పెయిర్ ఎవరికీ తెలీకుండా రహస్యంగా ఉంచారు. కానీ, వీళ్ళు తరచూ బయట కనిపిస్తుండటంతో లవర్స్ అని తెలిసిపోయింది.

అయితే, ఇప్పుడు వీరిద్దరి లవ్ బ్రేకప్ అయిందంటూ బాలీవుడ్ లో టాక్బి బాగా వినిపిస్తుంది. ఈ వార్త పై వాళ్ళు స్పందించకపోయినప్పటికీ సోషల్ మీడియా ఆధారంగా నెటిజెన్స్ కనిపెట్టేసారు. శ్రద్ధా కపూర్ ఇన్‌స్టా లో ప్రియుడి రాహుల్ మోడీని అన్ ఫాలో చేసింది. అలాగే, రాహుల్ మోడీ ప్రొడక్షన్ హౌస్ పేజీలను కూడా అన్ ఫాలో చేసింది. బ్రేకప్ వల్లే ఇలా చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది

Advertisement

Next Story