బొడ్డుకింద చేతులు పెడితే ప్రెగ్నెంట్ అయినట్లేనా?.. నెటిజన్లపై Ankita Lokhande ఫైర్

by Hamsa |   ( Updated:2022-09-03 10:48:09.0  )
బొడ్డుకింద చేతులు పెడితే ప్రెగ్నెంట్ అయినట్లేనా?.. నెటిజన్లపై Ankita Lokhande ఫైర్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి అంకితా లోఖండే ప్రెగ్నెంట్ రూమర్స్‌పై స్పందించింది. ఇటీవల భర్త విక్కీ జైన్‌తో గోవా వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేయడంతో బేబీ బంప్ కనిపిస్తుందంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. దీంతో షాక్ అయిన నటి.. బొడ్డుకింద చేతులు పెట్టుకున్నంత మాత్రాన గర్భం దాల్చినట్లేనా, ఎందుకిలా పుకార్లు పుట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తాజాగా 'డాన్స్ ఇండియా డాన్స్'షోకు గెస్ట్‌గా హాజరైన నటిని 'మీరెప్పుడు సూపర్ మామ్ అవుతున్నారో చెప్పండి?' అని హోస్ట్ జే భనుశాలి ప్రశ్నించగా.. 'నేను ఇప్పటికీ ఇంకా పాపనే. కాబట్టి ఒక చిన్నపిల్ల మరో బేబీని ఎలా పెంచి పోషిస్తుంది?' అంటూ ఫన్నీ రిప్లయ్ ఇచ్చిన అంకిత.. కుంటుంబాన్ని విస్తరించే ఆలోచనలు ఇప్పట్లో లేవని స్పష్టం చేసింది.

Also Read : ఆ స్టార్ హీరో సెక్స్ కోసం డేటింగ్.. కోరిక తీరిన తర్వాత బ్రేకప్

Also Read : లిఫ్ట్ ఇస్తానంటూ బైక్ ఎక్కించుకున్నాడు.. కొంతదూరం వెళ్లాక ఏమైందంటే?

Advertisement

Next Story