- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ankit Koyya: నేను అల్లు అరవింద్ కొడుకును.. అల్లు అర్జున్ మా అన్నయ్య.. షాకింగ్‌గా యంగ్ హీరో కామెంట్స్
దిశ, సినిమా: సీనియర్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఇందులో రావు రమేష్ కొడుకుగా అంకిత్ కొయ్య నటించాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్టు 23న రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో ముచ్చటించాడు.
‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ లో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు ఇంట్లో ఏడిపిస్తారు కదా... 'నువ్వు మాకు పుట్టలేదు. ఎక్కడి నుంచో తీసుకు వచ్చాం' అని! అలాంటిదే నా క్యారెక్టర్ కూడా. అయితే.. 'నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య' అనుకునే టైపు. ఒకానొక సీన్ వచ్చినప్పుడు రావు రమేష్‌ను 'మా ఇంటికి ఎప్పుడు పంపిస్తావ్' అని కూడా అడుగుతాడు. ఆ క్యారెక్టర్ నుంచి మంచి ఫన్ జనరేట్ అవుతుంది’ అని తెలిపారు. అలాగే ‘నిహారిక 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'కు వచ్చే కథలు ఫిల్టర్ చేసి ఆవిడ దగ్గరకు నేను పంపిస్తా. 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా చేసే అవకాశం వచ్చిందని తెలిసి 'లక్ష్మణ్ కార్య మంచి దర్శకుడు. అవకాశం వదులుకోకు' అని చెప్పారు. ఈ సినిమాను ప్రమోట్ చేస్తానని అన్నారు. 'ఆయ్' మంచి విజయం సాధించింది. అది 'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నా’ అంటూ నిహారిక నిర్మాణ సంస్థ గురించి చెప్పుకొచ్చాడు.