Sharukh Khan తో కలిసి స్టెప్పులేసిన Anirudh.. ఆ ఫర్మార్మెన్స్‌కు నెటిజన్లు ఫిదా

by Shiva |   ( Updated:2023-09-02 13:25:20.0  )
Sharukh Khan తో కలిసి స్టెప్పులేసిన Anirudh.. ఆ ఫర్మార్మెన్స్‌కు నెటిజన్లు ఫిదా
X

దిశ, సినిమా : యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్న ఆయన ప్రస్తుతం కంపోజ్‌ చేసిన లేటెస్ట్ చిత్రం ‘జవాన్‌’. అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ హీరోగా వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్.

కాగా, ఈ కార్యక్రమంలో షారుఖ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన క్రేజీ మూమెంట్స్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు అనిరుధ్. అంతే కాదు ఈ పోస్టుకు ‘Pure love for @iamsrk’ అంటూ క్యాప్షన్ ఇవ్వగా.. ఇందులో షారుఖ్‌తో కలిసి మాస్ బీట్‌కు స్టెప్పులేయడం, ఆ తర్వాత ఇద్దరు ప్రేమగా కౌగిలించుకోవడం చూడొచ్చు. ఇక, ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైర‌ల్‌ అవుతుండగా ఇరువురి ఫ్యాన్స్ కూడా మురిసిపోతున్నారు.

Advertisement

Next Story