అనిరుధ్ మ్యూజిక్ హవా.. ఇండస్ట్రీని ఏలుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

by Nagaya |
అనిరుధ్ మ్యూజిక్ హవా.. ఇండస్ట్రీని ఏలుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
X

దిశ, సినిమా: యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడనే చెప్పాలి. దీంతో కోలీవుడ్‌లో అతనికి ధీటుగా నిలిచే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరూ కనిపించడం లేదు. ఇకపోతే యువన్ శంకర్ రాజా, సంతోష్ నారాయణన్, డి.ఇమాన్, అలాగే దేవిశ్రీ ప్రసాద్ సత్తా చాటుతున్నప్పటికీ.. అనిరుధ్ దూకుడు ముందు వీళ్లెవరూ కనిపించడం లేదు. ఇక అనిరుధ్‌ లాగానే తెలుగులో తమన్ హవా నడుస్తోంది. కానీ తనతో పోలిస్తే తమన్ కూడా డౌన్‌లోనే ఉంటాడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఎలాంటి ఫాంలో ఉన్నాడో చెప్పడానికి ఇటీవలే రిలీజైన 'విక్రమ్' సినిమా చాలు. ఇందులో ఉన్న రెండు మూడు పాటలు మామూలు కిక్కివ్వట్లేదు. ఇక నేపథ్య సంగీతం గురించైతే చెప్పాల్సిన పనేలేదు. మాస్, యాక్షన్ సన్నివేశాలలో బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో మూవీనీ మరో లెవెల్‌కు తీసుకెళ్తాడు. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే.. ఎన్టీఆర్-కొరటాల సినిమా, షారుఖ్ ఖాన్ 'జవాన్'.. రజినీకాంత్, అజిత్‌ల కొత్త సినిమాలు.. ఇలా అతని చేతిలో క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి.

Advertisement

Next Story