బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యానిమల్ మూవీ కలెక్షన్లు

by Nagaya |   ( Updated:2024-02-05 14:51:10.0  )
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యానిమల్ మూవీ కలెక్షన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఇండస్ట్రీలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు మారుమోగుతోంది. ఆయన దర్శకత్వంలో రీసెంట్‌గా విడుదలైన మూవీ ‘యానిమాల్’ బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ యాక్షన్ రొమాంటిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంతే కాకుండా మూవీపై పలు విమర్శలు వచ్చిన కూడా కలెక్షన్లు మాత్రం మాములుగా లేదు. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నిజానికి ఈ డైరెక్టర్ చేసిన సినిమాల వసూళ్లు పెరుగుతూ పోయాయి. వరల్డ్ టెలివిజన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి రూ.50కోట్ల వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండ బాలీవుడ్‌లో అతని మూవీస్ భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఇది ఇలా ఉంటే యానిమల్ మూవీ రూ.920కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించబోతుంది అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ కలెక్షన్లను చూసిన ఏ నిర్మాతకైనా, హీరోకైనా సందీప్ రెడ్డి వంగాతో మూవీ తీయాలనే ఆసక్తి కలుగుతోంది.

ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీపై ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు. ఈ మూవీకి సంబంధించి డేట్స్ ఫిక్స్ కాకముందే ఫైనల్ వెర్షన్ రెడీ చేయాలంటూ నిర్మాత అంటున్నారు. అంతేకాకుండ బన్నీ పాన్ ఇండియా మూవీ సిరీస్ కూడా లాక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ దర్శకుడు ఈ సినిమాలతో ఏ లెవల్‌లో కలెక్షన్లు తీసుకు వస్తాడో చూడాలి.

Read More..

తన గర్ల్ ఫ్రెండ్ సినిమా పై.. హృతిక్ రోషన్ వైరల్ కామెంట్స్

Advertisement

Next Story