రిలాక్స్ అవుతానంటే.. మా ఆవిడ అలాంటి పనులు చెప్తుంది: అనిల్ రావిపూడి

by Prasanna |   ( Updated:2023-12-12 05:32:33.0  )
రిలాక్స్ అవుతానంటే.. మా ఆవిడ అలాంటి పనులు చెప్తుంది: అనిల్ రావిపూడి
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా, సహ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా ‘బూట్‌కట్ బాలరాజు’. ఈ సినిమాలో అవినాష్, సద్దాం, ఇంద్రజ, మేఘ లేఖ, సిరి ప్రధాన పాత్రలో పోషించారు. ఈ సినిమాకి శ్రీ కోనేటి దర్శకత్వం వహించారు. మహమ్మద్ పాషా నిర్మాత. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడేందుకు ఆయన మైక్ అందుకుని ముందుగా తన మీద తాను జోక్ వేసుకుని అందర్ని నవ్వించారు. అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

షూటింగ్ ఉన్నప్పుడు తొందరగా బయలుదేరి వచ్చేవాడిని. సక్సెస్ వచ్చింది.. మా ఆవిడకు చెప్పా కొద్దిగా రిలాక్స్ అవుతానే అని. పొద్దున్నే పిల్లల్ని స్కూల్లో దింపమంది. కాబట్టి .. రేపటి నుంచి ఆ పనులు మొదలు పెడదాం అనుకుంటున్నా.. అని దర్శకుడు అనిల్ రావిపూడి నవ్వుతూ చెప్పారు. ఆయన ఇలా ఎందుకు చెప్పారో నెటిజన్స్ కి అర్ధం కాలేదు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. ‘బూట్‌కట్ బాలరాజు’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు కాస్త ఆలస్యంగావచ్చారు. తాను ఎందుకు ఆలస్యమయ్యానో చెప్పడానికి సరదాగా ఇంట్లో జరిగిన విషయాన్ని వివరించారు అనిల్. ఇలాంటి కామెడి పండించడంలో ఆయన దిట్ట కదా!

Advertisement

Next Story