ఆ అలవాట్లే కుటుంబాన్ని నాశనం చేశాయి.. స్టార్ నటి ఎమోషనల్

by Hajipasha |   ( Updated:2022-10-14 07:44:08.0  )
ఆ అలవాట్లే కుటుంబాన్ని నాశనం చేశాయి.. స్టార్ నటి ఎమోషనల్
X

దిశ, సినిమా: హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ, మాజీ భర్త బ్రాడ్ పిట్ విడాకుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఒకరిపై ఒకరు షాకిచ్చే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏంజెలీనా 2021లో తన మాజీ భర్తకు పంపిన లేఖను కోర్టులో సమర్పించగా ప్రస్తుతం ఆ లెటర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 'మా అమ్మ సాక్షిగా వివాహం చేసుకున్నాం. ఇక్కడే కవలలకు జన్మనిచ్చాం. జీవితాంతం వృద్ధాప్య సమయంలో కూడా ఇదే ఇంట్లో గడుపుదామని అనుకున్నాం. కానీ, ఈ రోజు ఇక్కడ కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నా. నా జ్ఞాపకాలను ఒక దశాబ్దం కాలం తర్వాత కూడా పదిలంగా గుర్తుంచుకుంటా' అని రాసుకొచ్చింది. అలాగే బ్రాడ్ పిట్ మద్యపాన వ్యసనంతో కుటుంబ జీవితానికి ముగింపు పలికాడని, అయినప్పటికీ ఏదో ఒక రోజు మళ్లీ తాము ఒకచోట చేరి ఆనందంగా ఉంటామని ఆశించినట్లు లెటర్‌లో ప్రస్తావించింది. చివరగా బ్రాడ్ చెడు అలవాట్లే తమ కుటుంబం, వ్యాపారంపై ప్రభావం చూపించాయన్న ఆమె.. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల తాను ఎంతో బాధపడ్డానని పేర్కొంది.

Advertisement

Next Story