సరికొత్త అవతారంలో షాక్ ఇచ్చిన యాంకర్ Vishnu Priya Bhimeneni

by Anjali |   ( Updated:2023-07-22 13:32:00.0  )
సరికొత్త అవతారంలో షాక్ ఇచ్చిన యాంకర్ Vishnu Priya Bhimeneni
X

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేసి.. తర్వాత ‘పోవే పోరా’ షోతో యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమయ్యారు విష్ణుప్రియ. గత ఏడాది ‘వాంటెడ్ పండుగాడు’ చిత్రంలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ప్రస్తుతం ఆమె ‘దయ’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్ ఆగస్టు 4 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో చక్రవర్తి, ఈషా రెబ్బాతో పాటు ఈ యాంకర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ భామ ప్రముఖ శివక్షేత్రం వారణాసిలో ప్రత్యక్షమై అందరికి షాక్ ఇచ్చింది. కొద్దిరోజులు వృత్తిపరమైన విషయాలు పక్కన పెట్టి.. మైండ్ రిలీఫ్ కోసం భక్తి పారవశ్యంలో మునుగుతుందట. కాగా విష్ణుప్రియ వారణాసి ట్రిప్ పిక్స్ ఇన్‌స్టాలో పంచుకోగా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ‘ఏంటి విష్ణుప్రియ ఆధ్యాత్మిక బాట పట్టావా? ఉన్నట్టుండి సరికొత్త అవతారంలో షాక్ ఇచ్చావ్‌గా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Advertisement

Next Story