Rumours పై స్పందించిన Anchor Suma

by Prasanna |   ( Updated:2022-12-28 09:20:18.0  )
Rumours పై స్పందించిన Anchor Suma
X

దిశ, సినిమా : బుల్లితెర యాంకర్ సుమ కనకాల యాంకరింగ్‌కు దూరమవుతుందనే వార్తలపై స్పందించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆమె.. 'హలో.. రీసెంట్‌గా ఓ న్యూ ఇయర్ ఈవెంట్ చేయడం జరిగింది. దాని ప్రోమో కూడా రిలీజ్ చేశాం. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమోషనల్ అయిన మాట వాస్తవమే. అది ఏమిటో ఎపిసోడ్ చివర్లో తెలుస్తుంది. కంగారు పడకండి. నాకు చాలామంది ఫోన్లు, మెసెజ్‌లు చేస్తున్నారు. నేను బుల్లితెర కోసమే పుట్టాను. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనేవుంటాను. ఎటూ వెళ్లడం లేదు. కాబట్టి మీరు హాయిగా ఉండండి. హ్యాపీగా ఉండండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వీడియోను మాత్రం సుమ వెంటనే ట్విట్టర్ నుంచి డిలీట్ చేసింది. ఎందుకు అలా ట్వీట్‌ను డిలీట్ చేసింది అనే విషయం మాత్రం క్లారిటీ రావడంలేదు.

ఇవి కూడా చదవండి : అర్థంలేని అభ్యుదయవాదం.. హాలీవుడ్ నటులపై శ్రుతి హాసన్

Advertisement

Next Story