నీకు సింగిల్‌గా ఇష్టమా.. గ్రూప్ గానా.. గెస్ట్‌‌ను లైవ్‌లోనే అడిగేసిన యాంకర్

by sudharani |   ( Updated:2024-02-12 06:58:44.0  )
నీకు సింగిల్‌గా ఇష్టమా.. గ్రూప్ గానా.. గెస్ట్‌‌ను లైవ్‌లోనే అడిగేసిన యాంకర్
X

దిశ, సినిమా: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాపులారిటీ దక్కించుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. నెట్టింట బోల్డ్ షోతో రచ్చ చేస్తుంది. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేయడంతో పాటు.. దారుణమైన ట్రోలింగ్స్‌కు కూడా ఎదుర్కొంటుంది. అయిన లెక్కచెయ్యని రీతూ.. నెట్టింట గ్లామర్ షో చేస్తూ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ పలు షోలతో బిజీగా ఉంటుంది. వాటిలో ‘దావత్’ షో ఒకటి. ఈ షోకు సెలబ్రెటీలను ఆహ్వానిస్తున్న ఈ అమ్మడు వాళ్లను కూడా బోల్డ్ ప్రశ్నలతో సతమతం చేస్తుంది. అసలు విషయంలోకి వెళితే..

గీతూ చౌదరి హోస్ట్‌గా చేస్తున్న ‘దావత్’ అనే టాక్ షోకు తాజాగా నవదీప్ వచ్చాడు. ఇక ఎప్పటిలాగే రెచ్చి పోయిన రీతూ నవదీప్‌కు బోల్డ్ ప్రశ్నలు వేసింది. మొదట మీకు నేను పోరంబోకు ఫ్యాన్‌ని అని చెప్పింది. దానికి షాక్ అయిన నవదీప్ నవ్వాడు. మీరు తీసిన ‘పోరంబోకు’ సినిమాను థియేటర్లలో చూసిన ఏకైక పోరంబోకు ఫ్యాన్ నేను అంటూ తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఇదే విధంగా చిత్ర విచిత్రమైన ప్రశ్నలతో సందడి చేసిన రీతూ లాస్ట్‌లో ‘మీకు సింగిల్‌గా ఇష్టమా.. గ్రూప్ గానా’ అని అడిగింది. దీనికి స్పందించిన నవదీప్.. ‘సింగిల్, గ్రూప్’ ఏంటీ? అని ఎదురు ప్రశ్నించాడు. నువ్వు ఇప్పుడు లోపల ఏం అనుకున్నావో దాని గురించే అడుగుతున్నా అంటూ చెప్తూ.. ఇప్పుడు చెప్పు ‘సింగిల్ ఇష్టమా.. గ్రూపా..?’ అని మరోసారి ప్రశ్నించింది. దీనికి రియాక్టైన నవదీప్ సింగిల్ గానే అంటూ సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story