Anasuya: మీకు దమ్ముంటే వాళ్ళను అనండి.. నెట్టింట వైరల్ అవుతున్న అనసూయ ట్వీట్!

by Prasanna |   ( Updated:2024-07-26 14:14:11.0  )
Anasuya: మీకు దమ్ముంటే వాళ్ళను అనండి.. నెట్టింట వైరల్ అవుతున్న అనసూయ ట్వీట్!
X

దిశ,సినిమా: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఈమె ఏం మాట్లాడుతున్నా కూడా నెటిజెన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఫోటోలను షేర్ చేస్తుంటుంది. వాటి మీద కూడా ఏదొక కామెంట్స్ చేస్తూనే ఉంటారు.

అనసూయకి ధైర్యం చాలా ఎక్కువే ఎవరైనా ఆమెను ట్రోల్స్ చేసినప్పుడు కూడా వారికీ ధీటుగానే సమాధానం చెప్తాది. వివాదాస్పద అంశాల గురించి మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా అలాంటి పోస్ట్‌ ఒకటి నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. ఇది ఎవర్ని ఉద్దేశించి పెట్టిందో తెలీదు కానీ, ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది.

ఆ ట్వీట్ లో '" మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? నేను ఏం మాట్లాడినా అది ట్రోల్స్ చేస్తుంటారు ఆ టాపిక్ గురించే మాట్లాడుతారు మీకు దమ్ముంటే వారిపైన చూపించండి నా మీద కాదు కానీ, మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి గొడవ పడటం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా” అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ మీరు ఎవరి గురించి పెడితే వారి పేరు టాగ్ చేసి పెట్టొచ్చు కదా ఇలా అర్ధం కాకుండా పెట్టడం ఎందుకంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story