ANASUYA: స్టార్ హీరోను రిజెక్ట్ చేసి.. విజయ్ దేవరకొండను మొగుడిగా యాక్సెప్ట్ చేసిన అనసూయ.. షాక్‌లో ఫ్యాన్స్

by Anjali |
ANASUYA: స్టార్ హీరోను రిజెక్ట్ చేసి.. విజయ్ దేవరకొండను మొగుడిగా యాక్సెప్ట్ చేసిన అనసూయ.. షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య ఏదో విషయంలో వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలా రోజులుగా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కామెంట్లు చేసుకున్నారు. అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య కూడా నెట్టింట తీవ్ర చర్చ కొనసాగింది. అయితే హాట్ యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించిన ‘సింబా’ చిత్ర ట్రైలర్ నేడు (జులై 24) విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంటోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్ర ట్రైలర్‌లో అనసూయ స్కూటీపై వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి, స్కూటీ తుడుస్తూ ‘అక్క అక్క నీకు మహేష్ బాబు లాంటి మొగుడొస్తాడక్క అంటాడు. దీంతో అనసూయ హూ హూ అంటుంది. నీకు విజయ్ దేవరకొండలాంటి మొగుడొస్తాడక్క అనగానే నవ్వుతుంది’. ఈ ట్రైలర్‌లో ఈ సీనే హైలెట్‌గా నిలిచింది.

కాగా విజయ్ దేవరకొండతో మీకు గొడవలు అయిపోయినట్లేనా? అని ఓ వ్యక్తి ప్రశ్నిస్తాడు. ఇప్పుడు వాటన్నింటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవడం లేదని అనసూయ తెలిపింది. దర్శకుడు అడిగాడు కాబట్టి.. ఫన్నీగా ఉంటుందని చేశానని, అందరూ చూసి నవ్వుకుంటారని ఓకే చెప్పానంది. అంతేకానీ తనకు ఎవరిపై ఎలాంటి కోపం లేదని అనసూయ కూల్‌గా సమాధానం చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్రైలర్ వీక్షించిన జనాలు మహేష్ ను వద్దని, వివాదమున్న విజయ్ దేవరకొండను మొగుడిగా యాక్సెప్ట్ చేశావ్‌‌గా హాట్ యాంకర్ అంటూ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది అసలు ఆ డైలాగ్ కు ఎలా అంగీకరించావంటూ ఆశ్యర్యపోతున్నారు.

Advertisement

Next Story