విల్లును తలపిస్తోన్న అనసూయ.. లేడీ బాస్ స్టన్నింగ్ ఫొటో షూట్ వైరల్

by Anjali |
విల్లును తలపిస్తోన్న అనసూయ.. లేడీ బాస్ స్టన్నింగ్ ఫొటో షూట్ వైరల్
X

దిశ, సినిమా: బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వెండితెరను ఏలుతుంది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. రీసెంట్‌గా ఈ భామ నటిస్తోన్న ‘సింబా’ ట్రైలర్ విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంతో పాటు అనసూయ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుకుంటూ సాగుతోంది. మొదటి భాగంలో రంగమత్త ఏ రేంజ్‌లో అద్భుత ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు.

ఇకపోతే తాజాగా హాట్ యాంకర్ అనసూయ విల్లులా వంగి అదిరిపోయే ఫొటోలకు స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. హెయిర్ స్లైల్ మొత్తం కర్ల్స్ చేసి.. కోట్ మాదిరి డ్రెస్‌ ధరించి స్టైలిష్ లుక్‌లో అదరహో అనిపిస్తుంది. చేతిలో పట్టుకున్న చిన్న హ్యాండ్ బ్యాగ్ నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అనసూయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా యువత లేడీ బాస్ అంటూ ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story