పెళ్లి వేడుకలో అనసూయ ట్రెడిషనల్ లుక్.. ముచ్చటేస్తున్న క్యూట్ హాఫ్ శారీ పిక్స్ వైరల్

by Anjali |   ( Updated:2024-03-11 15:33:40.0  )
పెళ్లి వేడుకలో అనసూయ ట్రెడిషనల్ లుక్.. ముచ్చటేస్తున్న క్యూట్ హాఫ్ శారీ పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: బుల్లితెర స్టేజ్ పై యాంకరింగ్ చేసి.. ప్రస్తుతం వెండితెరపై స్టార్ నటిగా దూసుకుపోతుంది యాంకర్ అనసూయ. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. గత ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో దాక్షాయణి పాత్రలో నటించి అదరహో అనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఈ బోల్డ్ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగింది.

తాజాగా ఈ హాట్ నటి ట్రెడిషనల్ లుక్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హాఫ్ శారీలో అనసూయ ఇచ్చిన స్టన్నింగ్ స్టిల్స్ ను తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వగా.. ప్రతి ఒక్కరూ వావ్.. మైండ్ బ్లోయింగ్ అంటూ అనసూయపై కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఈ పిక్స్ తన బంధువుల పెళ్లి వేడుక కోసం పసుపు హాఫ్ శారీలో ట్రెడిషనల్ గా తయారైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో తన భర్త, పిల్లలతో కలసి ఈ యాంకర్ తెగ సందడి చేసింది. ప్రస్తుతం అనసూయ హాఫ్ శారీ పిక్స్ నెట్టింట జనాలందరినీ ఆకట్టుకుంటున్నాయి.


Read More..

మరోసారి హాట్ టాపిక్‌గా మారిన నయనతార.. తన రేంజ్ కాదని తెలిసిన విఘ్నేష్‌ను మ్యారేజ్‌ చేసుకోవడానికి కారణమేంటి?

Advertisement

Next Story