ఒంటిపై పాములు పాకుతుంటే సమ్మగా ఉంటుందంటున్న యంగ్ హీరోయిన్.. స్నేక్స్‌తో బ్యూటీ(వీడియో)

by Anjali |   ( Updated:2023-11-19 13:14:31.0  )
ఒంటిపై పాములు పాకుతుంటే సమ్మగా ఉంటుందంటున్న యంగ్ హీరోయిన్.. స్నేక్స్‌తో బ్యూటీ(వీడియో)
X

దిశ, సినిమా: అంబానీ ఫ్యామిలీ బర్త్ డే పార్టీకి హాజరైంది బ్యూటిఫుల్ అనన్యా పాండే. ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ ట్విన్స్ పుట్టినరోజు ముంబైలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయగా.. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు తను కూడా అటెండ్ అయింది. అయితే ఈ ఈవెంట్‌లో పాములు ప్రత్యక్షం కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ఈ యంగ్ బ్యూటీ పాములతో ఆడుతున్న ఫొటోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది.

‘మై డెఫినేషన్ ఆఫ్ హెవెన్.. పప్పీస్ అండ్ స్నేక్స్.. మై ఫేవరేట్ ఏనిమల్స్’ అంటూ ఈ పార్టీలో ఎంజాయ్ చేసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఒడిలో కుక్క పిల్లలు.. చేతిలో పాములు వేలాడుతున్న ఫొటోలు చూసిన అభిమానులు.. సెక్సీగా ఉన్నావని కామెంట్ చేస్తున్నారు. రియల్ ? ఫేక్? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. ఏ సినిమాలు లేక ఈ పని చేసుకుంటున్నావా? అని మరికొందరు విమర్శిస్తున్నారు.


Advertisement

Next Story