ఎలా ఉండకూడదో ఆ హీరోయిన్‌ను చూసి నేర్చుకున్నా.. అనన్య కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-12-14 13:34:05.0  )
ఎలా ఉండకూడదో ఆ హీరోయిన్‌ను చూసి నేర్చుకున్నా.. అనన్య కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ అనన్యా పాండే.. ఆదిత్యా రాయ్ కపూర్‌తో ప్రేమ వ్యవహారంతో ట్రెండ్ అవుతూనే ఉంది. వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందా అనే అనుమానాలు కలిగించేలా కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే దీపికా పదుకొణేతో ‘Gehraiyaan’లో కలిసి నటించిన భామ.. ఆమె నుంచి ఏం నేర్చుకుందో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వర్క్‌లో ‘ప్రాసెస్ ఓరియంటెడ్’గా ఉండటం నేర్చుకున్నానని తెలిపింది. సినిమాలో ఓ రోల్ చేస్తున్నప్పుడు సెట్స్‌కు వెళ్లి ఏం చేయాలి, ఎలా చేయాలని గాబరా పడిపోకుండా ముందుగా ఇంట్లోనే ప్రిపేర్ అవ్వాలని గుర్తించినట్లు చెప్పింది. అందుకే ప్రస్తుతం తన డైలాగ్స్‌తో పాటు కోస్టార్ లైన్స్, వారి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ అండ్ సిట్టింగ్ స్టైల్.. ఇలా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో సెట్‌లోకి వెళ్లినప్పుడు యాక్టింగ్ మరింత ఈజీ అయిపోతుందని చెప్పుకొచ్చింది అనన్య.

Advertisement

Next Story