Ananya Panday : పర్సనల్ లైఫ్, ప్రైవసీ మ్యాటర్స్‌పై అనన్య

by Prasanna |   ( Updated:2023-09-19 14:33:39.0  )
Ananya Panday : పర్సనల్ లైఫ్, ప్రైవసీ మ్యాటర్స్‌పై అనన్య
X

దిశ, సినిమా: నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో లవ్ ఎఫైర్‌పై వస్తున్న వార్తలపై అనన్యా పాండే స్పందించింది. ప్రస్తుతం ‘డ్రీమ్ గర్ల్ 2’ విజయాన్ని ఆస్వాదిస్తున్న నటి.. తన డేటింగ్ లైఫ్‌పై వస్తున్న వార్తలు చిరాకు తెప్పిస్తున్నాయని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నేను నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా ప్రైవసీ కోరుకుంటా. సినీ పరిశ్రమలో డేటింగ్, లవ్ అనేవి సాధారణ విషయాలుగా భావిస్తారు. నటీనటుల జీవితాల్లో రిలేషన్స్, బ్రేకప్స్ కామన్. మాలాంటి వాళ్లమంతా రెండు పదునైన కత్తి అంచుల మీద సాము చేస్తాం. కాబట్టి నేను ఎప్పుడూ ఉత్తమ నటిగా ఎదగాలని, ప్రజలు నన్ను గుర్తించాలని, నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలని కోరుకుంటా.. అంతేకానీ ఇతర విషయాల్లో జోక్యం చేసుకోను. ఇతరులు నా పర్సనల్ లైఫ్‌లోకి ఎంటర్ కావడాన్ని ఇష్టపడను. అందుకే వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నా అభిప్రాయం’ అంటూ క్లారిటీ ఇవ్వకుండానే దాటవేసింది.

ఇవి కూడా చదవండి : బోల్డ్ బ్యూటీ అందాలపై కన్నేసిన పోర్న్ స్టార్.. అందరిముందే సో హాట్ అంటూ

Advertisement

Next Story