కొన్ని గంటల్లో అనంత్ -రాధిక పెళ్లి.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన నీతా అంబానీ (వీడియో)

by Hamsa |   ( Updated:2024-03-02 15:44:34.0  )
కొన్ని గంటల్లో అనంత్ -రాధిక పెళ్లి.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన నీతా అంబానీ (వీడియో)
X

దిశ, సినిమా: భారతదేశంలోని సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ సుపరిచితమే. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక-అనంత్ అంబానీ డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి వేడుకలు మార్చి 1నుంచి 3 వరకు గుజరాత్‌లోని జూమ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఈ వివాహ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు వస్తున్నారు. అంతేకాకుండా ఈ పెళ్లి వేడుకల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఏకంగా 2500 రకాల వంటకాలను సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం దేశ నలువైపుల ఉన్న 30మంది బెస్ట్ చెఫ్‌లను రప్పించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, అనంత్ అంబానీ పెళ్లిపై ఆయన తల్లి నీతా అంబానీ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నీతా అంబానీ మాట్లాడుతూ ‘‘ అనంత్-రాధికల వివాహానికి సంబంధించి నాకు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నాయి. మొదటిది.. మన మూలాలను గుర్తుంచుకునేలా వేడుకలను నిర్వహించాలని ముందే అనుకున్నాము. అలాగే రెండోది.. ఈ పెళ్లి మన కళలు, సంస్కృతి, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకున్నాను. అంతా అనుకున్నట్లుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. మా హృదయాలకు ఎంతో దగ్గరైన ప్రాంతంలోనే నా కొడుకు పెళ్లి జరుగుతుండటం ఆనందంగా ఉంది. అక్కడే నా కెరీర్‌ను ప్రారంభించాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story