ఫోన్ ఇస్తానంటూ.. ఊర్వశికి కండీషన్ పెట్టిన అజ్ఞాతవాసి

by Hamsa |   ( Updated:2023-10-20 04:23:07.0  )
ఫోన్ ఇస్తానంటూ.. ఊర్వశికి కండీషన్ పెట్టిన అజ్ఞాతవాసి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల క్రికెట్ స్టేడియంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఫోన్ పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్, అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఇటీవల భార‌త్, పాకిస్థాన్ జ‌ట్ల మధ్య మ్యాచ్ ముగిశాక ఊర్వశి రౌతేలా ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ట్వీట్ చేసింది. తన ఐఫోన్ పోయిందని తిరిగి తనకు ఇచ్చేయాలని రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు పెట్టింది. ఫోను పోయిందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా, ఓ వ్యక్తి తన దగ్గర ఆమె ఫోన్ ఉందని ఇవ్వాలంటే తన కండీషన్‌కు ఒప్పుకోవాలని మెయిల్ పెట్టాడు. ‘‘నీ ఫోన్ నా దగ్గర ఉంది. నీకు అది కావాలంటే.. నా సోదరుడు క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయాలి’’ అని మెయిల్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అవుతోంది.




Advertisement

Next Story